![]() |
![]() |
.webp)
హోటల్ కి కస్టమర్లు రాకుంటే చేస్తారు.. ఆయితే అది క్లోజ్ చేయాలి లేదా కస్టమర్లని అట్రాక్ట్ చేసే ఆఫర్లు పెట్టాలి. అదీ తెలియకుంటే హోటల్ మూసేయాల్సిందే. అయితే ఓ కొత్త స్కీమ్ తో గంగవ్వ ముందుకొచ్చింది. అసలు తను చేసిన పనేంటో తెలుసుకుందాం.
తెలంగాణాలోని ప్రతీ గ్రామంలో గంగవ్వ చేసిన వ్లాగ్స్ కనిపిస్తుంటాయి. ఆమెని ఇన్ స్పైర్ చేసుకొని కొన్ని గ్రామాలలోని వాళ్ళు కొత్తగా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేస్తున్నారు. బయట వచ్చే సిచువేషన్ ని బట్టి సీన్లు చేయడం, మొబైల్ లోనే ఎడిట్ చేసి వాటిని వారి సొంత యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేస్తున్నారు. అయితే గంగవ్వ బిగ్ బాస్ కి వెళ్ళి ప్రపంచమంతా తెలిసింది. ఆ తర్వాత తన రూటే సపరేట్ అయింది. దుబాయ్ కి కూడా వెళ్ళి అక్కడ ఓ ఈవెంట్ లో మాట్లాడింది. అలా గంగవ్వ ఫేమస్ అయింది. తను ఇలా అవ్వడానికి అనిల్ జీలా ప్రధాన కారణం. మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానెల్ లో తనతో మాట్లాడించి, డైలాగ్స్ చెప్పించి ఫేమస్ చేసాడు. అందుకే అనిల్ జీలాకి కూడా తెలంగాణలో ఎంతో మందికి మార్గనిర్దేశం అయ్యాడు. అయితే విలేజ్ లో జరిగే వాటిని అంతే సహజంగా చూపిస్తూ ఎన్నో యూట్యూబ్ ఛానెల్స్ డబ్బు సంపాదించుకుంటున్నాయి. అయితే గంగవ్వ, చందు, అంజి మామ, అనిల్ జీల లాంటి కొందరు కలిసి " విలేజ్ షో - మిక్స్ " అనే యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేశారు.
గంగవ్వ చేసిన ఓ వ్లాగ్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. మొన్నటికి మొన్న మేడారం సమ్మక్క సారక్క జాతరకి పోంగ అనే వీడియోని అప్లోడ్ చేయగా అది అప్పుడు ట్రెండింగ్ నెంబర్ వన్ కి చేరింది. ఇప్పుడు రైతులకు ఉపయోగపడేలా మరో వ్లాగ్ చేసింది. రైతులు పొలాల్లో పనులు చేస్తుంటే మధ్యలో వారికి విశ్రాంతి దొరకదు. అలాంటి వారి కోసం తన హోటల్ నుండి టీ తీసుకొచ్చి ఇస్తుంది. అంటే ప్రజల వద్దకే పాలన లాగా. రైతుల వద్దకే ఛాయ్ అన్నమాట. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ప్రతీ విలేజ్ లో మారుమ్రోగుతుంది. గంగవ్వ సాధారణంగా చేసిన వైరల్ అవుతుందని మరోసారి నిరూపించింది.
![]() |
![]() |